
అంతర్జాతీయంగా నెలకొన్ని ట్రేడ్ వార్(Trade War)తో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) విధించిన టారిఫ్స్(Tariffs) వల్ల మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్స్(Gold Rates) రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పుత్తడి కొనుగోలు చేసేందుకు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయంగా ట్రంప్ సుంకాల విధింపుతో ధరలు దిగివస్తున్నాయని, సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా ఈ రోజు (ఏప్రిల్ 8న) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో(Hyderabad bullion market) బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపై రూ. 600 తగ్గి ₹82,250 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి ₹89,730 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 89, 880కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.82, 400గా పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,03,000గా నమోదైంది. కాగా, గత 5 రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ.3,700 వరకూ తగ్గడం విశేషం.