
ఇటీవల రోజురోజుకూ బంగారం ధరలు(Gold Rates) పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవేళ రెండు, మూడు రోజులు తగ్గినా అది స్వల్పంగా ఉండటం.. పెరిగితే అమాంతం పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. నెల క్రితం బంగారం ధరలు రూ. లక్షకుపైగా నమోదై ఆల్ టైమ్ రికార్డు ధరను నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే రేంజ్‌తో పసిడి రేట్లు పరుగులు పెడుతున్నాయి.
కేజీ వెండిపై రూ. వెయ్యి పెంపు
దీంతో ఇవాళ (జూన్ 5) HYD బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.91,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పెరిగి రూ.99,600 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.1,14,000గా ట్రేడవుతోంది. ఇక నిన్నటితో పోలిస్తే రూపీ వ్యాల్యూ(Rupee Value) కాస్త మెరుగుపడింది. దీంతో ఇవాళ ఒక US డాలర్‌కు రూ.85.91గా ఉంది.