బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ (మే 20) బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో వైపు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారం రేటు పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.490 తగ్గి రూ.95,020 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గి ప్రస్తుతం రూ.87,100 వద్ద కొనసాగుతోంది. అటు ఏపీలోని విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,09,000 ఉండగా, ఈరోజు రూ.100 పెరిగి రూ.1,09,100కు చేరుకుంది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) రూ.85.60గా నమోదైంది.






