భారతీయులది బంగారానిది విడదీయలేని అనుబంధం. ముఖ్యంగా భారతీయ మగువుల జీవితంలో పసిడి ఓ భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే తప్పకుండా మగువల మెడలో గోల్డ్ ఆభరణాలు (Gold Ornaments) ఉండాల్సిందే. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో ఓ భాగం. మరోవైపు పెట్టుబడి సాధనం (Gold Investment)గానూ పుత్తడి ఎంతో ఉపయోగపడుతుంది. కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకుంటుంది. అందుకే భారతీయులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తుంటారు.
స్వల్పంగా తగ్గిన పసిడి ధర
అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరలు (Gold Price Tosay) ఆకాశాన్నంటుతున్నాయి. రెండ్రోజుల క్రితం పసిడి ధర ఏకంగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి రికార్డు సృష్టించింది. అంతా అనుకున్నట్లుగానే ఏకంగా తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలకు చేరింది. అయితే రెండ్రోజుల తర్వాత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక బుధవారంతో పోలిస్తే గురువారం గోల్డ్ రేటులో మరింత తగ్గుదల కనిపించింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..?
భారీగా పెరిగిన వెండి రేటు
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర బుధవారం నాడు రూ.98,350 ఉండగా గురువారం నాటికి రూ.110 తగ్గి ప్రస్తుతం రూ.98,240 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి తులం రేటు నిన్న రూ.90,150 ఉండగా ఇవాళ్టికి రూ.100 తగ్గి రూ.90,050కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు (Silver Rates Today) మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి ధర బుధవారం రోజు రూ.98,650 ఉండగా, గురువారం నాటికి రూ.1,800 పెరిగి రూ.1,00,450కు చేరుకుంది.






