అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Price) భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా దేశం మార్కెట్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటింది. అయితే బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం డాలర్ విలువ(Doller Value) తగ్గడమే అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్స్(Stock Markets) నష్టాల్లో ఉండటంతో అటు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్(Investers) చేసేవారు తమ పెట్టుబడులను మార్కెట్ నుంచి ఉపసంహరించి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఒకసారిగా బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని అంటున్నారు. మరోవైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకాయి. ఇక ఇవాళ (జులై 19) వెండి ధర తొలిసారిగా 1.25 లక్షల రూపాయలు దాటింది.
![]()
కేజీ వెండిపై ఏకంగా రూ.2,100 పెంపు
ఇక శనివారం (జూలై 19) హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.660 పెరిగి రూ.1,00,040 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగి ప్రస్తుతం రూ.91,700 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,23,900 ఉండగా, ఈరోజు రూ.2100 పెరిగి రూ.1,26,000కు చేరుకుంది.






