బంగారం (Gold) అంటే మహిళలకు ఎంతో ప్రీతిపాత్రం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా ఏ నగలు వేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు మగువలు. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. పుత్తడితో పాటు వెండికీ మంచి డిమాండ్ ఉంది. అందుకే వీటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి (Silver) ధరలు పెరిగాయి. ఆదివారం రూ.87,600 ఉన్న 10 గ్రాముల బంగారం ధర .. సోమవారం నాటికి రూ.440 పెరిగి రూ.88,040కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర ఆదివారం రోజున రూ.97,700 ఉండగా, సోమవారం నాటికి రూ.100 పెరిగి రూ.97,800 వద్ద పలుకుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఇవాళ (ఫిబ్రవరి 10వ తేదీ) బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూద్దామా..
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.88,040గా .. కిలో వెండి ధర రూ.97,800 వద్ద పలుకుతోంది.
- విజయవాడలో రూ.88,040గా పది గ్రాముల బంగారం ధర ఉండగా.. కిలో వెండి ధర రూ.97,800 వద్ద విక్రయిస్తున్నారు.
- విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర రూ.88,040.. కిలో వెండి ధర రూ.97,800గా ఉంది.
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.88,040గా .. కిలో వెండి ధర రూ.97,800 వద్ద అమ్ముడుపోతోంది.






