Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో వైపు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారం రేటు పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Is wearing gold jewellery lucky - Krishna Jewellers

తెలుగు రాష్ట్రాల్లో ఇలా…

ఇక సోమవారం (ఆగస్టు 11) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.760 తగ్గి రూ.1,02,280 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.93,750 వద్ద కొనసాగుతోంది. అటు ఏపీలోని విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,27,000ఉంది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) రూ.87.70గా నమోదైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *