Diwali Special: పాము గోళీలు, చుట్ట పటాసులు గుర్తున్నాయా?

Mana Enadu: దసరా పండుగ(Dussehra festival) ముగిసిందో లేదో మూడు వారాల్లోనే దీపావళి(Diwali) వచ్చేస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటిళ్లిపాది సంతోషంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకునే ఈ ఫెస్టివల్(Festival) ఎప్పుడూ స్పెషలే. ప్రతి ఇళ్లూ విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతుంది. ప్రతి ఇంటా దీపకాంతులు ఎంతో ఆకట్టుకుంటాయి. హిందువుల పండుగలలో దీపావళి ఓ ముఖ్యమైన పండుగ. నరకాసుర వధ(Narakasura Vadha) తర్వాత ప్రజలు సంతోషంగా బాణ సంచాపేల్చి, స్వీట్లు(Fireworks and sweets) పంచుకునే అత్యంత ఆనందదాయకమైన ఫెస్టివల్ ఇది. అయితే ఈ దీపావళి నేపథ్యంలో మన చిన్నజాటి జ్ఞాపకాలను(Childhood Memories) ఓసారి నెమరు వేసుకుందామా..

 ఈ బాంబులు చాలా స్పెషల్

చిన్ననాటి జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన క్షణాలు. అవి మన జీవితంలోని అత్యంత విలువైన నిధులు. ఈ వేగవంతమైన జీవితంలో, మనం రోజూ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. కానీ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్(Special Feeling) చాలా బాగుంటుంది. దీపావళి(Diwali) వచ్చిందంటే.. పటాసులు తీసుకురమ్మని చిన్నప్పుడు నాన్నను అడిగేవాళ్లం. అందులో కుక్క బాంబులు, లక్ష్మీ పటాసులు(Lakshmi crackers), తాటాకు బాంబులు, వంకాయ బాంబులు, కాకరపువ్వొత్తొలు, భూచక్రాలు, రాకెట్లు(Rockets) వంటివి ఎన్నో ఉండేవి. ఇలా ఎన్ని చెప్పుకున్నా దీపావళి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మీకూ మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తకొస్తున్నాయా..

 అవి లేకపోతే పంగడే ఫుల్‌ఫిల్ కాదు

చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఎన్ని పటాసులు తీసుకొచ్చినా.. చిన్న తుపాకీ(Gun), చుట్ట పటాసులు లేకపోతే పండగే ఫుల్‌ఫిల్ అయ్యేది కాదు. ఆ తుపాకీలో చుట్ట పటాసులు పెట్టి కాల్చితే గట్టిగా చప్పుడు వచ్చేది. తుపాకీ లేనివాళ్లు ఆ చుట్టలను గోడకేసి రుద్దేవారు. బండతో కొట్టి పేల్చేవారు. వీటితో పాటే చిన్న డబ్బాలో నల్లగా ఉండే పాము గోళీలు కూడా ఉండేవి. వాటిని కాల్చితే.. నల్లని పొగతో పాటు పాము లాంటి ఆకారం పైకి వచ్చేది. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు గానీ ఉంటే.. ఒకరు ఎంతో ఇష్టంతో పటాసులు కాల్చేవారు. మరొకరు పటాసుల పెద్ద పెద్ద శబ్దాలకు భయపడి గట్టిగా చెవులు మూసుకునేవారు. అమ్మ, అక్కాచెల్లెళ్లు గడపల్లో దీపాలు పెట్టి సంతోషంగా కాకరపూవొత్తులు వెలిగించేవారు. ఈసారి దీపావళిని ఇంకా బాగా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో క్రాకర్స్ కాల్చేటప్పుడూ తగిన జాగ్రత్తలు తప్పక పాటించడం మర్చిపోకండే..

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *