ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) శుభవార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు(Employees) ఒక కంపెనీ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ పీఎఫ్ ఖాతా(PF Account)ను బదిలీ చేసుకునే విధాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) మరింత సులభతరం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన(Afficial Announcement) విడుదల చేసింది. ఎక్కువ సందర్భాల్లో పనిచేసే సంస్థ నుంచి అనుమతి లేకుండానే PF అకౌంట్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చిన స్పష్టం చేసింది.

ఏటా 1.25 కోట్ల మంది చందాదారులకు లబ్ధి
అలాగే ప్రస్తుతం పాటిస్తున్న విధానం ప్రకారం ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను బదిలీ చేయాలంటే ఇటు PF ఆఫీసు, అటు కొత్త పీఎఫ్ కార్యాలయం(PF Office) అనుమతి తప్పనిసరి. తాజాగా పాత పీఎఫ్ ఆఫీస్ అన్ని క్లెయిముల(Claims)కు అనుమతి ఇస్తే నేరుగా కొత్త పీఎఫ్ ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఇందుకోసం ఫామ్-13ను అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపింది. దీని వల్ల ఏటా 1.25 కోట్ల మంది చందాదారులు లబ్ధి పొందటంతో పాటు రూ.90 వేల కోట్ల నగదు బదిలీ వేగవంతం(Speed up money transfer) కానున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది.








