
ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న కాగ్నిజెంట్(Cognizan) సంస్థ 2025లో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించాలన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ సంస్థ 7,500 మందిని నియమించుకుంది. దీతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,42,800కి చేరింది.
కాగ్నిజెంట్ లాభాల్లో 14% పెరుగుదల
2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ 14% లాభవృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే సంస్థ నికర లాభం 645 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఆదాయం 8.1% పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 7.2% పెరిగిందని సంస్థ తెలిపింది.
2025 పూర్తి సంవత్సరానికి ఆదాయ అంచనాలు:
సీఈఓ రవి కుమార్ ప్రకారం, సంస్థ ప్రథమార్థంలో మంచి పనితీరు కనబర్చిందని, రెండో త్రైమాసికంలో రెండు మెగా ఆర్డర్లు దక్కాయని తెలిపారు. ప్రస్తుత జులై-సెప్టెంబర్ కాలంలో ఆదాయం 5.27 నుండి 5.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. వార్షిక ఆదాయం 4.7% నుంచి 6.7% వృద్ధితో 20.7-21.1 బిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని సంస్థ పేర్కొంది.
ఏఐ ప్రాజెక్టుల్లో పెరుగుదల
గతేడాదితో పోలిస్తే కాగ్నిజెంట్‌కు సంబంధించిన ఏఐ ప్రాజెక్టులు 1,400 నుండి 2,500కి పెరిగాయి. మరోవైపు, మొత్తం 30 కోడ్‌లను పూర్తి స్థాయిలో మెషీన్లే తయారు చేశాయని సంస్థ తెలిపింది. ఈ వేగవంతమైన పురోగతులు ఉద్యోగులకే కాదు, ఐటీ రంగాన్ని ఆశ్రయిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు అందిస్తాయనడంలో సందేహం లేదు.