
మీరు డిగ్రీ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతునారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) తాజాగా ఓ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది
చివరి తేదీ: ఆగస్టు 17, 2025
అధికారిక వెబ్‌సైట్: https://orientalinsurance.org.in
అర్హతలు:
అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తిచేసి ఉండాలి.
SSC / ఇంటర్మీడియట్ / డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఉత్తీర్ణత అవసరం.
దరఖాస్తు చేస్తున్న రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,405 నుండి రూ.62,265 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
పోస్టులకు ఎంపిక కావడానికి మూడు దశల పరీక్షలు నిర్వహించబడతాయి:
1. ప్రిలిమినరీ పరీక్ష – సెప్టెంబర్ 07, 2025
2. మెయిన్స్ పరీక్ష – అక్టోబర్ 10, 2025
3. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ – ముఖ్యమైన భాగం
ఈ ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి అవకాశాన్ని కోల్పోకుండా వెంటనే అప్లై చేయండి!