Multibagger: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 1 షేరు కొంటే మరో 2 షేర్లు ఉచితం!

మిడ్ క్యాప్ టోబాకో(Tobacco Company) రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ (Godfrey Phillips India Ltd) తన షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. కంపెనీ డైరెక్టర్లు ఆగస్టు 4, 2025న బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక ఫలితాలపై చర్చించడమే కాకుండా, బోనస్ షేర్ల ప్రతిపాదనపై ఆమోదం తెలపనున్నారు.

కంపెనీ ప్రకారం, షేర్ హోల్డర్ల( Investors)కు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చే ప్రతిపాదతను పరిశీలించి ఆమోదం తెలుపనున్నారు. అంటే ఒక షేరు ఉన్న వారికి రెండు ఉచిత బోనస్ షేర్లు(Buy 1 Share, Get 2 More Free) లభించనున్నాయి. ఈ కంపెనీ గత ఏడాదిలోనే 124 శాతం లాభం ఇచ్చింది. ఐదేళ్లలో చూస్తే 931 శాతం రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్(Multibagger Stock) స్టాక్ ఇది. ఐదేళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు అలాగే వదిలేసినా వారికీ దాని విలువ ₹10 లక్షలు అయి ఉంటుంది.

1844లో స్థాపితమైన ఈ సంస్థ దేశంలో అతిపెద్ద సిగరెట్ల తయారీ కంపెనీల్లో ఒకటి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. 2024 చివరి నాటికి 1123 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 48,950 కోట్ల వద్ద ఉంది. ఇన్వెస్టర్లు రాబోయే బోనస్ ప్రక్రియపై అప్డేట్స్ కోసం కంపెనీ అధికారిక ప్రకటనల్ని గమనిస్తూ ఉండాలి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *