పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)షూటింగ్ ఇప్పటికే పూర్తయి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజి’ (OG)సినిమా కూడా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తాజాగా పవన్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’Ustad Bhagath Sing షూటింగ్లోనూ పాల్గొంటున్నాడు.
అయితే పవన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ అరుదైన రికార్డును సెట్ చేయబోతున్నాడు. ఆయన సినీ ప్రస్థానంలో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల కావడం చాలా అరుదు. గతంలో కేవలం 2006లో మాత్రమే ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాలు ఏడు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇప్పుడీ సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. 2025లో కేవలం మూడు నెలల గ్యాప్‌లో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అధికారిక రిలీజ్ డేట్స్ ఇంకా ఖరారవ్వనప్పటికీ, ఈ రెండు చిత్రాలు 2025లో తప్పకుండా థియేటర్లలోకి రానున్నాయి.
ఇరవై ఏళ్ల గ్యాప్ తర్వాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్‌పై అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నుంచి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ హైప్ నెలకొంది.






