రత్నాలు(Diamonds), బంగారం(Gold) లాగానే వెండి ఆభరణాలకు కూడా దేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే, డిమాండ్ పెరిగిన సమయంలో కొంతమంది వ్యాపారులు నకిలీ లేదా కల్తీ వెండి(Silver) ఆభరణాలను విక్రయించే అవకాశముంది. ఈ మోసాలను అరికట్టేందుకు, వినియోగదారులను రక్షించేందుకు ప్రభుత్వం వెండి ఆభరణాలకూ హాల్‌మార్క్(Halmark) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
హాల్‌మార్కింగ్ అమలు
2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి(New Rules from September 1) ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు బంగారు ఆభరణాలకు మాత్రమే అమల్లో ఉన్న హాల్‌మార్కింగ్ వ్యవస్థను ఇప్పుడు వెండి ఆభరణాలకూ కూడా హాల్‌మార్క్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని వలన వినియోగదారులు నమ్మకంగా, స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయగలరు.
బీఐఎస్ స్వచ్ఛత స్థాయిలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాల కోసం ఆరు రకాల స్వచ్ఛత గ్రేడ్లను ప్రకటించింది. అవి 800, 835, 900, 925, 970, 990. ఆభరణాల నాణ్యత ఏ స్థాయిలో ఉందో ఈ గ్రేడ్ల ద్వారా స్పష్టమవుతుంది.
హాల్‌మార్కింగ్ విధానం
హాల్‌మార్కింగ్ ప్రక్రియలో ప్రతి వెండి ఆభరణానికి ప్రత్యేకంగా ఆరు అంకెల HUID నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబర్ ఆభరణం ప్రామాణికతను మరియు స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. వినియోగదారులు ఈ సంఖ్యను చూసి తమ ఆభరణం నిజంగా BIS హాల్‌మార్క్ ప్రమాణాలను అందుకుందో లేదో తెలుసుకోవచ్చు.
వినియోగదారుల ప్రయోజనం
BIS కేర్ యాప్‌లోని “Verify HUID” ఫీచర్ ద్వారా వినియోగదారులు హాల్‌మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను చెక్ చేసుకోవచ్చు. దీని వలన నకిలీ లేదా కల్తీ వెండి ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా నాణ్యమైన వెండి కొనుగోలు చేయాలనే నమ్మకం వినియోగదారుల్లో పెరుగుతుంది.
హాల్‌మార్క్ అంటే ఏమిటి?
హాల్‌మార్క్ అనేది బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛత, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. ఈ ప్రక్రియను BIS పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ ఉన్న ఆభరణం నిర్దిష్ట ప్రమాణాలను పాటించిందని దీనివల్ల స్పష్టమవుతుంది. మొత్తానికి, వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి కావడం వినియోగదారులకు భరోసా కలిగించడమే కాకుండా, మోసాలను నివారించే కీలక నిర్ణయంగా భావించబడుతోంది.






