
తెలంగాణ(Telangana ) రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల( Women)కు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం వంటి అనేక ప్రయోజనాలు అమలవుతున్నాయి. తాజాగా, మహాలక్ష్మీ పథకం(Mahalakshmi Patakam) కింద 18 ఏళ్లు దాటి ఉన్న యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 25వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అన్ని శాఖల నుంచి నివేదికలు అందించాలని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు అధికారులకు ఇప్పటికే సూచించారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ముసాయిదాపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ ముసాయిదా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(telangana congress party) గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలులోకి తేనుంది.
ఈ పథకం ద్వారా ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారి జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావడమే ముఖ్య లక్ష్యం. నెలకు రూ.2,500 ఇవ్వడం ద్వారా వారి రోజువారీ ఖర్చులకు కొంత తోడ్పాటు లభించనుంది.
ఈ నిర్ణయం అమలవుతే లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందే అవకాశముంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత ప్రభుత్వం నుంచి రానుంది. సామాజికంగా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలన్న దృష్టితో మహాలక్ష్మీ పథకం కీలకంగా మారనుంది.