‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం దందా.. ఎక్స్‌ వేదికగా కేటీఆర్ ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt in TG) హైడ్రా(Hydra) పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్ర‌భుత్వంలోని కొందరు పెద్ద‌లు ఈ వ‌సూళ్ల దందాను న‌డిపిస్తున్నార‌ని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్ల‌పై పగబ‌ట్టార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు KTR ట్విటర్ (X) వేదిక‌గా సీఎం రేవంత్(CM Revanth) సర్కార్‌ తీరు ఎండగడుతూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో CM ఫ్యామిలీ రియ‌ల్ వ్యాపారం(Real Business) చేస్తోంద‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. RRR పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్ప‌డుతున్నారని ఫైర్ అయ్యారు.

ఆరు గ్యారంటీలు గాలికి వదిలేశారు..

ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు భరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయర‌ని KTR విమ‌ర్శించారు. పదేళ్ల KCR పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణ(Telangana)ను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లార‌ని మండిప‌డ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని KTR పిలుపునిచ్చారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *