హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేసు కేసు (Formula E Race Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ విచారణ ముమ్మరం చేశాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక విషయాలు బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్ కో (Green Co) సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో రూ.41 కోట్లు చెల్లించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 2002 ఏప్రీల్ 8 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య 26 సార్లు బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఏసీబీ ఆఫీసు నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఇక ఈ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ (KTR ACB Case), ఆయన లీగల్ టీమ్ ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడగా.. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. తాను మర్యాదగా విచారణకు సహకరిస్తుంటే.. ఇంతమంది పోలీసులెందుకు? అని ఆయన ప్రశ్నించారు. కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
విచారణ పేరుతో ఏసీబీ కార్యాలయానికి నన్ను పిలిచి.. నా ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/QtGQDc3nk3
— BRS Party (@BRSparty) January 6, 2025
నాతోపాటు లాయర్లుంటే నష్టమేంటి?
‘‘ఈరోజు ఏసీబీ ఆఫీసుకు రమ్మన్నారు. నన్ను అడుగుతున్న సమాచారమంతా సర్కార్ వద్దే ఉంది. గతంలో ఓ మంత్రిగా నేను నిర్ణయం తీసుకుంటే.. నా వద్ద సమాచారం ఉందని అనుకుంటున్నారు. నా వాదనను ఇప్పటికే హైకోర్టుకు వివరించాను. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చట్టాలపై గౌరవంతో ఏసీబీ ఆఫీసుకు వస్తే.. నా లాయర్ ను లోనికి రావద్దంటున్నారు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నప్పుడు ఇంతమంది పోలీసులెందుకు? న్యాయవాదిని అనుమతించమని ఏసీబీ వాళ్లు చెప్పాలి కానీ పోలీసులెందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు. నాతో పాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టమేంటి?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
❇️ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేస్ విచారణ కోసం వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఏసీబీ అధికారులు
❇️ రోడ్డుపైనే తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించిన @KTRBRS
❇️ ఈ అంశంలో తనకు… pic.twitter.com/j6JUmzXhIk
— BRS Party (@BRSparty) January 6, 2025







