
అహ్మదాబాద్(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది విమాన ప్రయాణికులు(Air passengers) కాగా, కొందరు స్థానికులు(the natives) కూడా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మృతుల సంఖ్యపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటనతో తెరపడింది. కాగా జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్(London)కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్(Air India Dreamliner) విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 275 మంది మరణించగా, వారిలో 241 మంది విమాన ప్రయాణికులని, మిగిలిన 34 మంది విమానం కూలిన ప్రాంతంలోని స్థానికులని ప్రభుత్వం తెలిపింది.
Authorities in #Gujarat said on Tuesday they had identified all but one of 260 #bodies recovered following an #AirIndia #planecrash earlier this month in #Ahmedabad.https://t.co/GO3pFwKrRH
— Deccan Herald (@DeccanHerald) June 24, 2025
ఇప్పటి వరకూ 260 మంది మృతుల గుర్తింపు
ఇప్పటివరకు డీఎన్ఏ పరీక్షల(DNA tests) ద్వారా 260 మంది మృతులను గుర్తించగా… వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. గుర్తించిన మృతదేహాల్లో 256 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో, 11A సీటులో కూర్చున్న ఒక్క వ్యక్తి మినహా మిగతా వారందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
34 killed on ground in Air India crash, Gujarat Health Dept confirms
The official count released at BJMC puts the death toll at 275….241 on board and 34 on the ground, many of them students at BJMC#airindiaplanecrash pic.twitter.com/Qfq8qN7o7y
— sajith Balagopalan (@bsajith1) June 24, 2025