రాష్ట్రంలో సంచలం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో (Meerpet Woman Murder Case) పోలీసులు కీలక అడుగు ముందుకేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు తాజాగా నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి ముక్కలుగా చేసి కిరాతకంగా హతమార్చిన ఎముకలను కాల్చి బూడిదను చెరువులో పడేసిన విషయం తెలిసిందే. అయితే తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా.. ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఈ కేసులో అడుగు ముందుకేయలేకపోయారు.
గురుమూర్తి అరెస్టు
కానీ ఘటనాస్థలిలో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic Lab) కు పంపారు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టు, కీలక ఆధారాలు ఆధారంగా నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించనున్నారు.
అతను చాలా సాఫ్ట్
ఇక ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తన గురించి సహోద్యోగులు, స్థానికుల్ని విచారించగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి బ్యాక్ గ్రౌండ్ అంతా సాదాగా ఉందని.. అంత సామాన్యమైన ఇంత కిరాతకంగా హత్య ఎలా చేశాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు ఆశ్చర్యపడుతున్నారు. డీఆర్డీవోలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, చాలా మృదుస్వభావి అని అతడి సహోద్యోగులు చెప్పినట్లు సమాచారం.






