సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. అద్భుతమైన ఆవిష్కరణతో అబ్బురపరుస్తోంది. మనిషి ఇతర గ్రహాలపై నివసించేందుకు మార్గాలు కనుక్కుంటున్నాడు. కానీ అజ్ఞానం సైతం అదే స్థాయిలో వేళ్లీనుకుపోయిది. కరీబియన్ దేశం హైతీలో (Haiti) ఇటీవల జరిగిన ఓ ఘటనే ఇందకు నిదర్శనం. తన కుమారుడికి చేతబడి చేయించారనే ఆగ్రహంతో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి. తన గ్యాంగ్‌తో మారణహోమం (Gang violence)సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను National Human Right Defense Network (RNDDH) తాజాగా వెల్లడించింది.
హైతీలోని సైట్ సోలైల్ అనే ప్రాంతంలో మోనెల్ మినానో ఫెలిక్స్ అనే వ్యక్తి అవ్ అన్సన్మ్ అనే గ్యాంగ్ నడిపిస్తున్నాడు. అయితే మోనెల్ మినానో ఫెలిక్స్ కుమారుడు ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతడు ఓ పూజారిని కలవగా ఆ ప్రాంతంలోని కొంతమంది వృద్ధుడు చేతబడి (witchcraft) చేశారని చెప్పాడు.
అంతే మోనెల్ మినానో ఫెలిక్స్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ మురికి వాడలో ఉన్న 60 సంవత్సరాలు పైబడిని వృద్ధులపై తన ముఠా సభ్యులతో దాడి చేయించాడు. డిసెంబర్ 7, 8వ తేదీల్లో ఆ వాడలో కొడవళ్లు, కత్తులతో వృద్ధులపై విచక్షణారహితంగా దాడి చేయించాడని RNDDH వెల్లడించింది. ఈ ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అత్యంత రద్దీగా ఉండే ఆ మురికివాడ ప్రాంతంలో గ్యాంగ్‌ల సంచారం తీవ్రంగా ఉంటుంది. ఫోన్లు వివియోగించే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఇంత మారణహోమం జరిగినా విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.







