రఫాలోని గాజా హ్యుమానిటేరియన్ (humanitarian aid) ఫౌండేషన్ కేంద్రం వద్ద ఆదివారం కాల్పులు జరిపింది హమాస్ (Hamas) టెర్రరిస్టులే అని ఇజ్రాయిల్ చెబుతోంది. తమ ఐడీఎఫ్ దళాలు ఎలాంటి కాల్పులు జరపలేదని పేర్కొంటూ ఓ డ్రోన్ వీడియో కూడా విడుదల చేసింది. ఈ కాల్పుల వెనక హమాస్ ఉన్నట్లు పేర్కొంది. ఓ వ్యక్తి తుఫాకీ పట్టుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్లు ఆ వీడియోలో ఉన్నట్లు చెబుతోంది.
కాల్పులు జరిపింది హమాసే..
గాజాలోని (Gaza) ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర దేశాలు అందిస్తున్న సాయంతో అక్కడి ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే ఆదివారం ఒక్కసారి మానవతా సాయం పొందుతున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిసింది. దీంతో స్పాట్ లోనే 26 మంది చనిపోగా.. మరో 80 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ ప్రాంతం ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆధీనంలో ఉందని తాము కాల్పులు జరపలేదని హమాస్ చెబుతుండగా.. హమాస్ టెర్రరిస్టులే ప్రజలపై కాల్పులు జరిపినట్లు ఉన్న వీడియోను ఇజ్రాయిల్ విడుదల చేసింది.
వేల మందిపై ఒకేసారి కాల్పులు
ఇజ్రాయిల్ మద్దతు ఉన్న గాజా (Gaza) హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) పంపిణీ కేంద్రం వద్ద ఈ దాడి జరిగిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వేల సంఖ్యలో సరకుల కోసం వస్తున్న జనాలపైకి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా అక్కడ మానవతా సాయం అందించడంలో ప్రస్తుతం ఎలాంటి అవరోధాలు లేవని ఇజ్రాయిల్ పేర్కొంది.






