దేశముదురు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో పరుగులు తీసింది బ్యూటీ హన్సిక (Hansika). ఆ తర్వాత మరిన్ని సినిమాలతోనూ మెప్పించింది. అయితే కెరీర్ సోసోగా సాగుతున్న టైమ్ లో బాయ్ ఫ్రెండ్ సోహైల్ తో 2022లో మ్యారేజ్ చేసుకుంది. తమ వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యమెంటరీ సిరీస్ గా కూడా విడుదల చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ.. కొద్దిరోజులుగా ఈ జంట విడిపోతున్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలకు ఆజ్యం సోసేలా తాజాగా హన్సిక తమ వివాహ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. దీంతో వీరు డైవర్స్ తీసుకున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే తమ విడాకుల వార్తలపై కొద్దిరోజుల క్రితం సోహైల్ ఖండించినప్పటికీ హన్సిక (Hansika Motwani) మాత్రం ఇప్పటివరకూ మాట్లాడలేదు. కాగా తాజాగా పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో మరోసారి ఇది హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీ గాంధారితో భయపెట్టనున్న హన్సిక
వివాహం తర్వాత కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక.. ఆ తర్వాత జోరు పెంచారు. కొద్దిరోజుల క్రితం ‘గార్డియన్’ మూవీతో అలరించారు. ఇప్పుడు ఆర్.ఖన్నన్ డైరెక్షన్ లో రూపొందుతున్న హారర్ మూవీ ‘శ్రీ గాంధారి’ (Sri Gandhari) నటిస్తోంది. బ్రిగిడ సాగ, స్టంట్ సిల్వ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శతాబ్దాల క్రితం ఓ రాజు నిర్మించిన గంధర్వ కోటలోకి ఓ ప్రాజెక్ట్ కోసం ఆఫీసర్ గా వెళ్లే క్యారెక్టర్ లో నటిస్తోంది హన్సిక. ఆ కోటలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ.
Divorce Rumors Get Real! Hansika Motwani Removes All Wedding Photos with Sohael Khaturiya from Instagram#glamsham #HansikaMotwani #SohaelKhaturiya #Divorce #Rumors https://t.co/wfq83CrLKn
— glamsham.com (@glamsham) August 5, 2025






