Happy Birthday Virat: రికార్డుల రారాజు.. టీమ్ఇండియా ఆణిముత్యం విరాట్

ManaEnadu: ఫార్మాట్ ఏదైనా పరుగులు పిండుకోవడమే అతడి స్పెషాలిటీ.. బౌలర్ ఎవరైనా దంచికొట్టడమే అతడి నైజం. ఛేజింగ్‌లో మిగతా జట్టు సభ్యులు తడబడినా.. తాను మాత్రం క్రీజులో పాతుకుపోయి కొండంత లక్ష్యాన్ని కూడా ఇట్టే కరింగించేస్తాడు.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. అదేనండి రన్‌మెషీన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli). వన్డే, T20, టెస్టులాంటి ఫార్మాట్లలో శైలి మార్చుకుంటూ అదరగొడుతూ అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో తనదైన ముద్ర వేశాడు విరాట్. పరుగులు సాధించడమైనా, ప్రత్యర్థులకు మాటకుమాటతో సమాధానం చెప్పడమైనా, మైదానంలో అభిమానులను తన సరదా చేష్టలతో ఎంటర్‌టైన్ చేయడమైనా కోహ్లీకి ఎవరూ సాటిరారు. నేడు ఈ పరుగుల రారాజు 36వ పుట్టిన రోజు(Birth Day).

 కోహ్లీ కెరీర్ మొదలైందిలా..

1988 నవంబర్ 5న ఢిల్లీ(Delhi)లో జన్మించిన విరాట్.. తన ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ తల్లి గృహిణికాగా తండ్రి లాయర్‌గా పనిచేశారు. తన ఇద్దరు తోబుట్టువులతో కలిసి కోహ్లీ ఉత్తమ్ నగర్‌లో పెరిగాడు. కోహ్లీ విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. కోహ్లీ 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ(West Delhi Cricket Academy)లో చేరాడు. 2002లో ఢిల్లీ అండర్-15 జట్టుతో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. 2003-2004 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీకి జట్టు కెప్టెన్ అయ్యాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ(Vijay Merchant Trophy) కోసం ఢిల్లీ అండర్-17 జట్టుకు 2004లో ఎంపికయ్యాడు. కోహ్లీ ఏప్రిల్ 2007లో ఇంటర్నేషనల్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2017 డిసెంబర్ 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మను విరాట్ వివాహం చేసుకున్నాడు.

 పరుగుల రారాజు అని ఇందుకే అంటారు..

కాగా విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 118 టెస్టులు ఆడి 9040 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 295 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కింగ్.. మొత్తం 13,906 రన్స్ బాదాడు. ఇదులో 50 సెంచరీలు, 72 అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవల టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ఆ ఫార్మాట్లో 125 మ్యాచులు ఆడి 4188 రన్స్ చేశఆడు ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఐపీఎల్‌లో విరాట్ విశ్వరూపమే చూపించాడు. మొత్తం 252 మ్యాచులు ఆడి 8004 రన్స్ చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 55 అర్ధశతకాలు ఉన్నాయి. పైగా 2011 WC, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 T20WC నెగ్గిన టీమ్‌లో విరాట్ భాగమవ్వడం విశేషం.

https://twitter.com/RAHULKUMAR705/status/1853638779539738817

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *