Mana Enadu : పాకిస్థాన్ వేదికగా 2025 లో చాంపియన్స్ ట్రోపీ Champions Trophy నిర్వహణ ఇంకా అనుమానంగానే ఉంది. పాకిస్థాన్ లో టోర్నీ పెడితే తాము ఆడేది లేదంటూ బీసీసీఐ తేల్చి చెప్పేసింది. హైబ్రిడ్ మోడ్ లోనే ఆడతామని కూడా స్పష్టత నిచ్చింది. ఈ సమయంలో ఇటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (pcb) దిగరాక తప్పలేదు. ఐసీసీ, బీసీసీఐ రూల్స్ చెప్పిన విషయానికి ఓకే చెప్పిన పాక్ ఒక మెలిక పెట్టింది. తాము కూడా భారత్ లో మ్యాచులు ఆడమని మాకు కూడా భారత్ లో నిర్వహించే ఐసీసీ సిరీస్ లకు వేరే వేదికల్లో మ్యాచులు జరపాలని కోరారు.
దీంతో భారత మాజీ క్రికెటర్ టర్బోనేటర్ హర్బజన్ సింగ్ Harbhajan Singh స్పందించాడు. ఇండియా పాకిస్థాన్ లో ఆడాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ముందు మెరుగుపడాలి. అయినా మీ ఇష్టం ఉంటే ఇండియా కు రావొచ్చు. లేకపోతే లేదు. మీరు భారత్ వచ్చినా, రాకపోయినా మాకు కలిగే నష్టం ఏమీ లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో తాము ఎలాంటి బాధ పడటం లేదన్నాడు. పాక్ భారత్ కు రాకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరని అన్నారు.
ముంబయి టెర్రర్ ఎటాక్ తర్వాత..
2008 ముంబయి టెర్రర్ ఎటాక్ తర్వాత భారత్ పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ (icc) టోర్నీల్లోనే రెండు జట్లు ఆడుతున్నాయి. ఇటు భారత్ 2008 నుంచి ఇప్పటి వరకు పాక్ లో పర్యటించలేదు. కానీ ఐసీసీ టోర్నీల్లో తటస్థ వేదికల్లో ఆడింది. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత్ కు పాక్ వచ్చింది. 2011 సంవత్సరంలో కూడా భారత్ లో పాక్ పర్యటించింది. కానీ భారత్ మాత్రం పాక్ కు వెళ్లలేదు. పాక్ లో ఆత్మహుతి దాడులు, భద్రతా పరంగా లోపాలు, టెర్రర్ ఎటాక్ లు ఎక్కువ కావడంతో భారత్ పాక్ వెళ్లడం లేదు. ముందు పాకిస్థాన్ లో భద్రతా చర్యలు పటిష్టం కావాలి. ఆ తర్వాతే ఏమైనా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు.
గత పాకిస్థాన్ పర్యటనల్లో..
గత పాకిస్థాన్ పర్యటనలను హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. గతంలో పాక్ లో (pakisthan) మంచి ఆతిథ్యం ఇచ్చారు. బయటకు వెళితే భోజనం చేసిన తర్వాత వారు డబ్బులు తీసుకోలేదు. కొందరు మాకు శాలువాలు కప్పి సన్మానించారు. కానీ ఇప్పటి తరం క్రికెటర్ల ఆటను పాక్ అభిమానులు చూడలేకపోతున్నారు. విరాట్ కొహ్లీ (virat kohli) లాంటి మేటి ఆటగాడిని గేమ్ ను ప్రత్యక్షంగా పాక్ అభిమానులు చూడలేకపోవడం బాధాకరమన్నాడు.






