Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్.. ఎందుకో తెలుసా?

ManaEnadu: టీమ్ఇండియా(Team India) స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) అంటేనే స్పెషల్. ఎప్పుడూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా(Social Media)లో ట్రెండింగ్‌లోనే ఉంటారు. తాజాగా మరోసారి వేలికి స్పెషల్ రింగ్(Special Ring) ధరించి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇంతకీ ఆ స్పెషల్ ఏంటంటే.. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) విజయానికి గుర్తుగా హార్దిక్ పాండ్య తన ఎడమ చేతి వేలికి స్పెషల్ రింగ్‌ను ధరించారు. ఈ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌, ట్విటర్‌లలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. రింగ్ పైభాగంలో వరల్డ్ ఛాంపియన్స్(World Champions) అని రాసి ఉండగా, లోపలి భాగంలో తాను జాతీయ జెండా(National flag) పట్టుకున్న ఫొటో ఉంది. కాగా ప్రపంచ కప్‌లో హార్దిక్ 144 రన్స్ చేయడంతోపాటు 7.64 ఎకానమీతో 11 వికెట్లను పడగొట్టిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 17 ఏళ్ల తర్వాత T20WC టైటిల్‌ను గెలుచుకుంది.

 నా క్రికెట్ ప్రయాణం ముంబైతోనే ఆరంభం

కాగా ఐపీఎల్‌(Indian Premier League)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు గత సీజన్‌లో కెప్టన్‌గా పాండ్య ఈసారి రిటెన్షన్‌లోనూ కోట్లు పలికాడు. రూ.16.35 కోట్లకు MI హార్దిక్‌ను రిటైన్ చేసుకుంది. ఈ సందర్భంగా పాండ్య స్పందించాడు. తన క్రికెట్ ప్రయాణం ముంబైతోనే ప్రారంభమైందని, తన ప్రగతి, విజయాలకు ఈ జట్టుతో వీడదీయరాని అనుబంధం ఉందని చెప్పాడు. తనను మళ్లీ రిటైన్ చేసుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ముంబై యాజమాన్యం తనను ఎల్లప్పుడూ ఎంతగానో ఆదరిస్తుందని, వారి ప్రేమ తనకు ఎంతో విలువైనదని చెప్పాడు.

 ఈసారి బలంగా తిరిగొస్తాం..

అంతేకాదు తన జట్టు సభ్యుల మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పిన హార్దిక్, 2013, 2015, 2017, 2019, 2020లో తోటి ప్లేయర్లతో కలిసి జట్టును బలోపేతం చేసిన సంగతులను గుర్తు చేశాడు. 2025లో కూడా తాము మరింత బలంగా, సమష్టిగా తిరిగి వస్తామని నమ్మకం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్‌లో ఉన్న అనుభవాలు తమకు ఒకే ఒక్క కుటుంబం లాంటివి అని, తాము ఐదు వేళ్ల మాదిరిగా వేరువేరు వ్యక్తులుగా ఉన్నప్పటికీ పిడికిలి బిగించేలా కలిసి ఉంటామని పేర్కొన్నాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *