
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్న విషయం తెలిసిందే. వీటిలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ ఒకటి. ఇటీవలే ఈ సినిమా నుంచి పలు అప్డేట్స్ ను మేకర్స్ షేర్ చేశారు. నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ సాంగ్ బీటీఎస్ వీడియో
హరిహర వీరమల్లు సినిమాలో వినాలి.. వీరమల్లు మాట వినాలి (Vinali Veera Mallu Maata Song) సాంగ్ లిరికల్ వీడియోను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటను స్వయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడారు. అయితే తాజాగా ఈ పాట బీటీఎస్ వీడియోను షేర్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. జనవరి 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
The energy behind the powerful vocals! 🔥 BTS video of #HariHaraVeeraMallu‘s 1st single will be out on 29th Jan @ 2:10 PM! 🌪💥 #HHVM 1st Single – https://t.co/5ObGwP2Rc6 #MaataVinaali #BaatNirali #KekkanumGuruve #MaathukeLayya #KelkkanamGuruve
Sung by the one and only,… pic.twitter.com/CKhRnjnHzO
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 28, 2025
రెండు భాగాలుగా హరిహర వీరమల్లు
ఏం గుల్పామ్ ఏం గురాయించి చూస్తున్నవ్ భయపెట్టనీకా..? ఓహో చాలా మందిని చూసినాంలే బిడ్డా. హే మునిమాణిక్యం చూసినవా.. గురాయించి చూస్తుండు బేటా.. మన లెక్క తెల్వదు.. వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి.. అంటూ తెలంగాణ యాసలో పవన్ కల్యాణ్ పాడిన పాట ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu Part 1) సినిమాలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మార్చిలో పార్ట్-1 రిలీజ్
మార్చి 28వ తేదీన పార్ట్-1 విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, బాబీ దియోల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.