పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్(Trailer)ను జూలై 3న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. జూలై 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
‘వీరమల్లు’ అనే బందిపోటు యోధుడి సాహసగాథగా
మొఘల్ కాలం నాటి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. మొఘల్ పాలకుల అధికారాన్ని ధిక్కరించి, ప్రజల పక్షాన నిలిచిన ‘వీరమల్లు’ అనే బందిపోటు యోధుడి సాహసగాథగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ(Director AM Jyothi Krishna) పూర్తి చేశారు. అంతకుముందు, క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు(Post Production Works) శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
HARI HARA VEERA MALLU TRAILER ON 3RD JULY#hariharaveeramallu #hhvm #hhvmtrailer #hariharaveeramallutrailer #pawankalyan #pspk #powerstarpawankalyan #NidhiAgarwal #krish #krishjagaralamudi #mmkeeravani #vikramjeetvirk #norafatehi #bobbydeol #moviemanblogger@moviemanblogger pic.twitter.com/oKe34d5zRX
— Moवीमॅనబ్లోக்અર (@moviemanblogger) June 28, 2025
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(MM Kiravani) అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. విడుదలైన నాలుగు పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Baby Deol) కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.






