
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్లో తొలి పాన్-ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు జులై 24న థియేటర్లలో విడుదలైంది. దాదాపు ఐదేళ్లుగా సెట్స్ మీదే ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎన్నో వాయిదాలు, అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టికెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమా విడుదలపై నిర్మాత ఏఎం రత్నం భారీ కృషి చేశారు. సినిమా షూటింగ్ దశ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ఎట్టకేలకు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌కి ఇది రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ మూవీ కావడం, అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడం వలన సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ కంటే ఓటీటీ డీల్(OTT Deal) పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్(Amezon Prime) రూ.50 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్(Streaming Date Revealed) అయ్యేలా డీల్ కుదిరినట్టు సమాచారం.
అయితే ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోయినా, తాజా థియేటర్ టైటిల్స్‌లో అమెజాన్ ప్రైమ్ పేరు కనిపించడంతో ఓటీటీ డీల్ కన్ఫామ్ అయిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.