పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది.
ఈ నేపథ్యంలో, జూలై 20న విశాఖపట్నం బీచ్ రోడ్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి(SS. Rajamouli) మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) ముఖ్య అతిథులుగా హాజరవనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి అన్న ఎం.ఎం. కీరవాణి(MM. Keeravani) సంగీతం అందించడంతో రాజమౌళి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడిగా ఉండటంతో, ఆయనకూ ప్రత్యేక ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ యోధుడి పాత్రలో పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా సందడి చేయనుంది. అదనంగా సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ కొంతవరకు డైరెక్ట్ చేయగా, చివరి భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






