
పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేసిన చిత్రం ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఎ.ఎం. జ్యోతి కృష్ణ, (A.M. Jyothi Krishna) దర్శకత్వం వహించారు. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Baby Deol), నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి అభిమానులకు మేకర్స్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ అదేంటంటే..
అనివార్య కారణాలతో వాయిదా?
పవర్ స్టార్ పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) వాయిదా పడింది. తిరుపతిలోని SVU తారకరామ క్రీడా మైదానంలో ఈనెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా(Postpone) వేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని VFX వర్క్స్ పూర్తి కానందునే మూవీ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు సమాచారం.
#HariHaraVeeraMallu – Release Delay??
Rumors are circulating that #PawanKalyan ‘s highly anticipated film HHVM has been postponed, citing financial issues as the reason.
If the rumors are true, this latest postponement would be a major setback for the film’s team and fans. pic.twitter.com/Y2FWAuMXCE
— MOHIT_R.C (@Mohit_RC_91) June 4, 2025