పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం నేడు (మే 16) అఫీషియల్‌గా ప్రకటించింది. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Boby Deol), సీనియర్ నటులు సత్యరాజ్, జిష్షు సేన్‌గుప్తా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఒకేసారి ఐదు భాషల్లో విడుదలకు సిద్ధం
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. కాగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు(Veeramallu) అనే యోధుడి పాత్రలో కనిపించనున్నారు. పవన్ నుంచి చాలాకాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో, హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టగా.. ఆస్కార్ విజేత MM కీరవాణి అందిస్తున్న సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
కాగా, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. VFX, సౌండ్ డిజైనింగ్, డబ్బింగ్ వంటి కీలక పనులను చిత్ర యూనిట్ వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు(Songs) సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, త్వరలోనే సినిమా మూడో సింగిల్‌తో పాటు అధికారిక ట్రైలర్(Trailer)ను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
After much anticipation and delays, Pawan Kalyan’s epic period drama Hari Hara Veera Mallu is finally hitting the big screens on June 12! Get ready for a grand cinematic experience!
Swipe for more South Cinema News related to Ronth Movie, Jr NTR Spotted with Son, Production No.… pic.twitter.com/O8pUeeU9CQ
— Hitflik (@HitFlik_) May 16, 2025






