పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.
మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి అయింది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎం. రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో సినిమాపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, థియేటర్లలో కూడా ఇదే క్రేజ్ కొనసాగితే, మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.
ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రిలీజ్‌కు ఇంకొద్దిరోజులే మిగిలుండగా, ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. తాజా సమాచారం మేరకు, బుక్ మై షో(BookMyShow)లో ఈ సినిమాపై విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే 3 లక్షలకుపైగా ప్రేక్షకులు బుక్ మై షో( BookMyShow )లో ఇంట్రెస్ట్ చూపించగా, ఇది ఒక రికార్డే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఓ మైథాలజికల్-హిస్టారికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకర్షించడమంటే అసాధారణమైన విషయమే.






