పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా కిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu). పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో HHMVకి సూపర్ న్యూస్ లభించింది. ఐదేళ్ల ఎదురుచూపులకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. ఈరోజు రాత్రి నుంచి ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే, ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదల విషయంలో ఇటీవల చిన్న గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. డిజిటల్ ప్రింట్ అందలేదని విదేశీ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. దీంతో కొందరు అభిమానులు ఆందోళన చెందారు.

వీరమల్లు విధ్వంసం చూసేందుకు సిద్ధం..
తాజాగా లైన్‌క్లియర్ అయిందని తెలుపుతూ సదరు సంస్థ పోస్ట్ పెట్టింది. ఓవర్సీస్(Overseas)లో అన్ని లోకేషన్లకు ప్రింట్‌లు వచ్చేశాయని పేర్కొంది. ఈ సినిమా ఫస్ట్‌హాప్ గంటా 26 నిమిషాల 40 సెకన్లు అని, సెకండ్‌హాఫ్ గంటా 18 నిమిషాల 25 సెకన్లు అని తెలిపింది (Hari Hara Veeramallu Runtime). ఈ చిత్రం ప్రదర్శించనున్న థియేటర్ల లిస్ట్‌ను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. వీరమల్లు విధ్వంసం చూసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. కాగా ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), ట్రైలర్(Trailer)కు భారీ స్పందన లభించగా, ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
#HariHaraVerraMallu AUSTRALIA 🇦🇺 Initial THEATER list OUT NOW.. Welcoming Grand Release, Ready for 24th July Premiere across the Country. #HHVMAUSBookings Open Now #HariHaraVerraMallu @Event_Burwood @HoytsAustralia @villagecinemas #Pawanakalyan @PawanKalyan @MegaSuryaProd… pic.twitter.com/EnHt8oi74M
— Dream Screens International Pty Ltd (@DreamScreensInt) July 16, 2025






