
పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veera Mallu)’ రేపు (జులై 24) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో విడుదలకు ఒకేరోజు సమయం ఉండటంతో ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని వీరమల్లు టీమ్ భావిస్తోంది. ఇప్పటికే ప్రెస్ మీట్లు, హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్(Prerelease event) నిర్వహించి గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇక ఈరోజు (జులై 23) వైజాగ్(Vizag)లో మరో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఏయూ కన్వెన్షన్ సెంటర్(AU Convention Center)లో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ఈవెంట్ నిర్వహిస్తే ఒకే సినిమాకు రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు నిర్వహించిన తెలుగు చిత్రంగా HHMV నిలువనుంది.
Repu vizag powerstar fans ki pandagey inka 🔥🔥🔥#HHVM #HHVMPreReleaseEvent #Pawanakalyan #HariHaraVeeraMallu pic.twitter.com/hosnBdZ4dQ
— hari3825 (@hkcinephile) July 22, 2025
1000 నుంచి 1500 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి
కాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్‌తో పాటు, చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్‌కు 1000 నుంచి 1500 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుందని, భద్రతా కారణాల రీత్యా పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయింది, U/A సర్టిఫికెట్ పొందింది. రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం కొన్ని సర్‌ప్రైజ్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన యాక్షన్-అడ్వెంచర్ డ్రామా, ఇందులో పవన్ కల్యాణ్ ఒక ధీరోదాత్త యోధుడి పాత్రలో కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), నర్గీస్ ఫాక్రీ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.