
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దేశ రాజధాని తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి తెలుగువారి కోసం ఈ పాన్-ఇండియా చిత్రంగా ఈ నెల 24న విడుదలైన హరిహర వీరమల్లు స్పెషల్ షోల(Special shows)ను ప్రదర్శించారు. ఈ మూవీకి అక్కడ భారీ క్రేజ్ దక్కింది.
Pawan Kalyan’s HHVM movie to be played in Delhi AP Bhavan for continuous two days! 👍🏻#HariHaraVeeraMallu pic.twitter.com/Stc1beh21f
— Harish Kalyan 🦅 (@_HarishKohli) July 26, 2025
ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో..
దీంతో ఏపీ భవన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియం(Dr. B.R. Ambedkar Auditorium)లో జులై 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సినిమా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తెలిపారు. శనివారం జరిగిన తొలి ప్రదర్శన హౌస్‌ఫుల్‌గా నడిచి, ప్రేక్షకుల నుంచి ఉత్సాహభరిత స్పందనను రాబట్టింది. ఆదివారం (జులై 27) సాయంత్రం 4 గంటలకు మరో ప్రదర్శన ఉంటుందని చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించారు. క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతి కృష్ణ దర్శకత్వంలో AM రత్నం నిర్మించిన ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందించారు.
Sri @pawankalyan garu
*#HHVM film show in Delhi AP Bhavan for two days*
Harihara Veeramalu, starring state deputy chief minister Shri Pawan Kalyan, has been screening in AP Bhavan for two days. Dr. B.R. AP Bhavan Resident Commissioner Shri Love Agarwal has issued two –
(1/3) pic.twitter.com/E9k756YV9K
— Dir Jothi Krishna Fan (@iam4pk_) July 26, 2025
ఈ సినిమా 17వ శతాబ్దపు నేపథ్యంలో హిందువులపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(Aurangzeb) విధించిన జిజియా పన్ను అన్యాయాన్ని ఎదిరించిన ధీరుడి కథగా రూపొందింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్(Resident Commissioner Love Agarwal) ఈ ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.