HHVM OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హరి హర వీరమల్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన భారీ హిస్టారికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీలో ట్రిమ్మింగ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. పాన్-ఇండియా స్థాయిలో జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఓటీటీ(OTT)లో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు, సినీ ప్రియులు సినిమాను ఇంట్లోనే వీక్షించేందుకు అవకాశం లభించింది.

అన్యాయాలకు వ్యతిరేకంగా వీరమల్లు పోరాటం

16వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వీరమల్లు అనే బందిపోటు కథే ఈ చిత్రం. కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునే క్రమంలో వీరమల్లు చేసే సాహసాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటించగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కనిపించారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం ‘స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో విడుదల కాగా, రెండో భాగం షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *