Mana Enadu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)పై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఇవాళ హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడన అందుతోందని తెలుస్తోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపం బట్టబయలైందని, ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని హరీశ్ రావు తెలిపారు.
నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ధర్నాలు(Dharnas) జరుగుతున్నాయని అన్నారు. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లాడడమే CMకు తెలుసని, హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన బూతులపై కాకుండా పాలనపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. హామీలు మాత్రమే కాకుండా, కేసీఆర్(KCR) గతంలో మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాల(Schemes)ను కూడా అమలు చేయడం లేదని తెలిపారు. బతుకమ్మ చీరెలు, రైతు బంధు, రుణమాఫీ(Bathukamma Sarees, Rythu Bandhu, Loan Waiver) లేవని చెప్పారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు జరగడం లేదు. రూ. 7521కు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించారు. కానీ రైతులు రూ. 5500కు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి. మద్దతు ధర రాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేదు.
LIVE : Former Minister, MLA @BRSHarish Press Meet at Telangana Bhavan https://t.co/flDVeI6eL3
— BRS Party (@BRSparty) October 28, 2024
పండుగ వేళ 144 సెక్షన్?
హైదరాబాద్(HYD)లో 144 సెక్షన్ విధించడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ‘పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో ఎవరైనా 144 సెక్షన్ పెడతారా? పెళ్లిళ్లకు ఎవరూ పోవద్దా? షాపింగ్‌లకు వెళ్లి దుస్తులు కొనుక్కోవద్దా? బంగారం షాపులకు వెళ్లి బంగారం కొనుక్కోవద్దా? క్రాకర్స్ కొనుక్కోవద్దా? ఎక్కడా నలుగురైదుగురు గుమిగూడకూడదా? ఇదేమీ రాజ్యం. రజాకార్ల రాజ్యంలాగే ఉంది ఇది’ అని హరీశ్ ఫైర్ అయ్యారు.