
BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అస్వస్థత(For illness)కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E racing case)కు సంబంధించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం KTR, హరీశ్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, అప్పటికే హరీశ్ రావు జ్వరం(Fever)తో మధ్యలోనే ఇబ్బంది పడటంతో వెంటనే ఆయనను అక్కడి నుంచి తరలించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు
వెంటనే పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రిలో చేర్పించారు. హరీశ్ రావు ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా అంతకుముందు హరీశ్ రావు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కౌంటర్ వేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.
దగ్గినా.. తుమ్మినా.. కేసులు పెడుతున్నారు..
ప్రస్తుతం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెడుతూ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. దగ్గినా.. తుమ్మినా.. కేసులు(Cases) పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు. ఇక కేటీఆర్ సామర్థ్యాన్ని వివరిస్తూ.. “KTR ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి” అని అన్నారు. ఆయనను ముట్టుకుంటే భస్మం అయిపోతారన్నారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, నాయకత్వ గుణాలు, కృషి ఏ రాజకీయ కుట్రలకైనా సమాధానం అవుతాయని హరీశ్ పేర్కొన్నారు.
Live: తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న మాజీ మంత్రి @BRSHarish గారు https://t.co/q7xBuCERF0
— Office of Harish Rao (@HarishRaoOffice) June 16, 2025