
టీమ్ఇండియా(Team India) యంగ్ ప్లేయర్ హర్షిత్ రాణా(Harshit Rana) T20 క్రికెట్లోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టీ20లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే(Shivam Dube) హెల్మెట్‌కి బంతి బలంగా తగిలింది. అయినా బ్యాటింగ్ కొనసాగించిన శివమ్ దూబే, ఫీల్డింగ్‌కి రాలేదు. అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్(Concussion substitute)గా హర్షిత్ రాణా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌ని ఎలా తుది జట్టులోకి తీసుకువస్తారని ఇంగ్లాండ్(England) జట్టు అభ్యంతరం తెలిపింది. అయితే భారత జట్టు సమర్పించిన 15 మంది జట్టులో పేస్ ఆల్‌రౌండర్‌గా హర్షిత్ రాణా ఒక్కడే ఉండడంతో అంపైర్లు కూడా ఏమీ చేయలేకపోయారు.
రాణా వచ్చీ రావడంతోనే..
దీంతో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా(Rana) మొదటి ఓవర్ రెండో బంతికే లివింగ్ స్టోన్(Livingstone) వికెట్ తీశాడు. ఆ తర్వాత బెథెల్, ఓవర్టన్‌ను పెవిలియన్ చేర్చిన మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. కాగా రాణా ఆస్ట్రేలియా(AUS)తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT) టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే.
3-1తో సిరీస్ కైవసం
కాగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచులో 15 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసింది. 53 పరుగులతో రాణించిన భారత బ్యాటర్ శివవ్ దూబేకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో భారత్ 5టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. చివరిదైనా నామమాత్రపు మ్యాచ్ ఈ నెల 2న ముంబై(Mumbai) వేదికగా జరగనుంది.
Indian team defeated England by 15 runs.
Shivam Dubey and Hardik Pandya played very well
The bowling of HarshitRana and Arshdeep Singh Singh was good.#INDvsENG#HardikPandya pic.twitter.com/BrCK2Md49g
— shailendra Singh (@shailendra_d96) January 31, 2025