
తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఇక శనివారం (మే 24) నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్(Medak), కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది 40- 50KM వేగంతో ఈదురుగాలులు(Gusts) వీచే ఛాన్స్ ఉంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు(Rains) కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. రేపు (మే 25) నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలోనూ వర్ష సూచనలు
అటు ఏపీ(Andhra Pradesh)లోనూ వర్ష సూచనలు ఉన్నాయి. మంగళవారం (మే 27) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతం(Bay Of Bengal)లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఇవాళ అల్లూరి, మన్యం,తూర్పుగోదావరి, కోనసీమ,కాకినాడ,ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.