
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం(Hyderabad Meteorological Department Centre) భారీ వర్ష సూచన(Heavy rain forecast) చేసింది. ఈరోజు నుంచి వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఇవాళ రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వర్షం ఏ జిల్లాలో ఏ రోజంటే..
ఆగస్టు 7, 2025 (గురువారం): హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడతాయంది.
ఆగస్టు 8, 2025 (శుక్రవారం): ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది.