హైదరాబాద్ మహానగరాన్ని శనివారం రాత్రి (ఆగస్టు 9) కూడా భారీ వర్షం(Heavy Rain) ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway)పై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు(Vehicular traffic) స్తంభించిపోయాయి. పెద్ద అంబర్‌పేట్ నుంచి LB నగర్ మీదుగా నగరంలోకి వచ్చే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్(Heavy Traffic) నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, నాగోల్, ఉప్పల్, ఎల్బీనగర్, BN రెడ్డినగర్ వంటి శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాదర్‌గుల్‌లో 80MM, హయత్‌నగర్‌లో 75MM చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
)
ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు
ఈ భారీ వర్షానికి సైదాబాద్(Saidabad)లోని రెడ్డి కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భాగ్యలత వద్ద కూడా రోడ్డుపై నీరు నిలవడంతో వాహనాలు నత్తనడకన కదిలాయి. ఇక నగరంలోని సికింద్రాబాద్, తార్నాక, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్ సహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం ప్రభావం చూపింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక చర్యలు చేపట్టి, వరద నీటిని తొలగించారు.

ఈనెల 13న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో జోరు వర్షాలు
ఇదిలా ఉండగా ఈనెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13,14,15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని HYD సహా జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో రేపటి (ఆగస్టు 11) నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక ఆదివారం రోజు కోస్తా, రాయలసీమల్లోని పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Saturday’s torrential rains brought the city to a standstill — streets submerged, traffic choked, and key routes blocked.
An #Ambulance carrying a patient was stranded under the #Malakpet bridge before being rescued with #HYDRAA machinery.
Flooding hit colonies in… pic.twitter.com/PfqPNTFV0h
— Hyderabad Daily News (@HDNhyderabad) August 9, 2025







