బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు(జూన్ 12), రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశలవైపు గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ(IMD) ప్రకారం, ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈ మేరకు తెలంగాణ(Telangana)లోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Break monsoon heat wave 🔚
Finally welcome monsoon rains for Telangana after a week gap in tg
Yesterday widespread rains lashed in North East Central West TG places see moderate rains ⛈️🌧️🌧️ pic.twitter.com/Xh2EkaiGxM— Warangal Weatherman (@tharun25_t) June 11, 2025
ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు
అటు ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నేడు(జూన్ 12), రేపు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చంది. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Daily Weather Inference 12:06:2025
UAC over Central AP & influence of this with Wind Converge over Karavalli Karnataka Konkan & Kerala will get Widespread Moderate/Heavy Rains likely today.Interior Karnataka Telangana and Rayalaseema likely get Moderate/Isolated Heavy Rains as… pic.twitter.com/V0Lz4lOkES
— MasRainman (@MasRainman) June 12, 2025






