
కళియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడం, స్కూళ్లు, కాలేజీల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తులు(Devotees) కిటకిటలాడుతున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనాని(Sarva Darshan)కి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు.
శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఇక శుక్రవారం అర్ధరాత్రి వరకు ఏడుకొండలవాడిని 71,721 మంది భక్తులు దర్శించుకోగా, 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో జూన్ 2 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams of Sri Govindaraja Swamy) జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు రేపు (ఆదివారం) సాయంత్రం అంకురార్పణం చేయనున్నట్లు TTD పేర్కొంది.