Mana Enadu : కల్యాణ ఘడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తెలుగు లోగిళ్లలో పెళ్లి(Marriage) హడావుడి, దుకాణాల్లో సందడి కనబడుతోంది. దాదాపు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరారయ్యాయి. ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడే సందడి.
పెళ్లి సందడితో వందల మందికి ఉపాధి
ఇన్నాళ్లు ముహూర్తాలు లేక వెలవెలబోయిన ఫంక్షన్ హాళ్లు(Function Halls) ఇక కళకళలాడబోతున్నాయి. పురోహితులు, మంగళ వాద్యాలు, బంగారం, వెండి ఆభరణాల తయారీ, వస్త్ర దుకాణాలు, రజకులు, విద్యుత్తు, వేదిక అలంకరణ, మైక్ సెట్లు, విందు భోజనం తయారు, విస్తరాకులు తయారు చేసే స్వయం ఉపాధి సంఘాలు, తాంబూలాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, దండలు, షామియానా, నిత్యావసరాలు, అద్దె కార్లు, కళాకారులు, ఐస్ క్రీం(Ice Cream) తదితర వృత్తిదారులకు ఇక భారీగా ఉపాధి లభించబోతోంది. వారు ఇక నుంచి ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. ఒక్కో వివాహ శుభకార్యంలో వందల మందికి పని దొరుకుతుంది.
ఇవే శుభముహూర్తాలు
ఇక ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది వేలల్లో వివాహాలు(Marriages in AP) జరగనున్నాయి. ఒక్కో వివాహానికి రూ.20 లక్షల నుంచి మొదలు పెడితే కోటి రూపాయల వరకు ఖర్చు చేయనున్నారు. ఇక ప్రముఖుల వివాహాలపై అవి పదుల కోట్లు దాటనున్నట్లు సమాచారం. నవంబరులో వందల సంఖ్యలో వివాహాలకు ముహూర్తాలు ఖరారైనట్లు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నవంబరులో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబరులో 4, 5, 9, 10, 11, 14, 15, 16వ తేదీలు(Marriage Dates) శుభప్రదమైన రోజులుగా పండితులు వెల్లడించారు.






