Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: తెలుగు సినిమా హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. తెలుగులో వినూత్న సినిమాలతో ముందుకు సాగుతున్న కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ (Ka Movie) ద్వారా హిట్ అందుకున్నారు. కిరణ్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్, మిగతా ప్రమోషన్స్ టైంలో కథలో కొత్తదనం లేదని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి

కిరణ్ అబ్బవరం నటి రహస్యను (Actress Rahasya) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రహస్య రాజావారు.. రాణివారు సినిమాలో యాక్ట్ చేసింది. కిరణ్ అబ్బవరం కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కిరణ్ ప్రస్తుతం జైన్స్ నాని డైరెక్షన్ లో ఒక కొత్త మూవీలో నటిస్తున్నాడు. కిరణ్ కు సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం యువ హీరోల్లో కిరణ్ ఒక్కడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు.

కాలును ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన కిరణ్

కిరణ్ తనకు కొడుకు పుట్టిన సందర్భంగా సోషల్ మీడియాలో కొడుకు కాలును ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో పాటు హనుమాన్ జయంతి (hanuman jayanthi) రోజు కొడుకు పుట్టడంతో సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి తమ ఇంటికి వచ్చినట్లుందని పోస్టు చేశాడు. కిరణ్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎస్ఆర్ కల్యాణ్ మండపం, ‘క’ మూవీ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. వినరో భాగ్యము విష్ణుకథ మూవీ కూడా మంచి కథ నేపథ్యం ఉన్నా.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *