తమిళనాడు రాజకీయా(Tamil Politics)ల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్(Vijay Thalapathy) తన తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే(Assembly Elections) లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ CM అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్‌ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి(TVK Executive Council) సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్,TVK పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు.
Vijay na declared as TVK’s CM candidate for 2026 polls!!👏🏻#Thalapathy#TVKVijay#TVK2026 pic.twitter.com/urJj1jU5sn
— ARJUN (@Imarjunbs) July 4, 2025
2026 ఎన్నికల్లో గెలుపుపై విజయ్ ధీమా
ఈ సందర్భంగా 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయాలు(Politics) సినిమాల్లా కాదని, ఇది చాలా సీరియస్ వ్యవహారమని ఆయన అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా, భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే తన పోరాటం ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.
#தமிழகவெற்றிக்கழகம் #TVKVijay #TVKForTN #TVKVirtualWarriors #tvk2026 #TamilagaVettriKazhagam#வெற்றித்_தலைவர்_விஜய் #TVKITWING #TVKparty #JanaNayagan #TVKAnnaNagarITWings@TVKVijayHQ pic.twitter.com/Kj1hOyhyMr
— Ajithkumar (@Ak_Subramani96) July 4, 2025






