
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తాజాగా వ్యాపార రంగం(business sector)లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా రంగంలో తన నటనతో గుర్తింపు పొందిన తమన్నా, ఇప్పుడు వ్యాపారవేత్తగా కొత్త ఒరవడిని సృష్టించాలని భావిస్తోందట. ఆమె ఫ్యాషన్ అండ్ బ్యూటీ రంగం(Fashion and beauty sector)లో సొంత బ్రాండ్(Own Brand)ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మిల్కీ బ్యూటీ ఈ రంగంలోకి రావడానికి ప్రధాన కారణం, ఆమె బ్రాండ్ విలువతోపాటు అభిమానుల ఆదరణను వినియోగించుకోవాలనే ఉద్దేశంగా తెలుస్తోంది.
తమన్నా కొత్త వెంచర్‌పై ఫ్యాన్స్ ఆసక్తి
ఆమె ప్రారంభించబోయే బ్రాండ్ పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి సారించనున్నట్లు టాక్. ఇది యువతను ఆకర్షించే వినూత్న డిజైన్లు, సౌందర్య ఉత్పత్తులను అందించనుంది. ఈ వెంచర్‌లో ఆమె ప్రముఖ వ్యాపార నిపుణులతో కలిసి పనిచేయనుంది.ఇప్పటికే సినిమా రంగం(Film industry)లో బిజీగా ఉన్న తమన్నా, వ్యాపారంలోనూ తన సత్తా చాటాలని నిశ్చయించుకుంది. ఈ కొత్త ప్రయాణం ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. తమన్నా అభిమానులు ఆమె ఈ కొత్త వెంచర్‌పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నయన్, రష్మిక బాటలోనే..
కాగా కొందరు హీరోయిన్లు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నారు. నయనతార(Nayanatara) ఓ కాస్మొటిక్ బ్రాండ్(Cosmetic brand)ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. పైగా నయనతార సక్సెస్ ఫుల్‌గా ఆ బిజినెస్‌ను నడిపిస్తోంది. అటు రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా ఓ పెర్‌ఫ్యూమ్ బ్రాండ్(Perfume brand)ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రష్మిక కంపెనీ విక్రయాలు చేస్తోంది.