జమ్ముకశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తిరుమలలో హై అలర్ట్ (Tirumala High Alert) ప్రరకటించారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ చేశారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తిరుమలలో హై అలెర్ట్..!
జమ్మూకాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం
ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్
అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను,… pic.twitter.com/njxfaNFred
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యటకులు మరణించారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. మరోవైపు దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంపై కఠిన ఆంక్షలు అమలు చేసింది.






