
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులు అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్‌లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఈ మేరకు వీరికి ఎన్‌ఐఏ కోర్టు(NIA Court) విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. కాగా 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్, దాని సమీపంలోని మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్ల(Twin Explosions)లో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.